వయోపరిమితి సడలించిన ప్రభుత్వం - జీవో విడుదల
ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ప్రస్తుతమున్న 42 ఏళ్ల వయోపరిమితిని 30 సెప్టెంబరు 2018 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సోమవారం జీవో 182ను జారీ చేసింది. 2014లో అప్పటి వరకు ఉన్న వయో పరిమితి 34 ఏళ్లను 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016లో దీన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు. అయితే, కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 2018 సెప్టెంబరు 30 వరకు తాజాగా దీనిని పొడిగించారు. ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నియమం వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు.