top of page

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు

రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం ఇవాళ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో కొన్నిటిని పరిశీలించి ఆయా చిహ్నాలను ఖరారు చేసారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఈ జీవోను విడుదల చేశారు. రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర వృక్షంగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వు ఎంపికయ్యాయి. ఈ చిహ్నాలు జూన్ ఆరు నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page