CFMS కొన్ని ప్రశ్నలు - సమాధానాలు

April 12, 2018

1. ఆన్లైన్ విధానం ఎప్పటినుండి అమలు ?

జ. ఏప్రిల్ 01,2018 నుండి

2. ప్రతీనెల జీతపు బిల్లులు ఏ తేదీ లోగా STO వారికి సమర్పించాలి ?

జ. పాత విధానంలో అనుసరించిన తేదీలనే

3. ప్రింట్ తీసిన కాపీలు అవసరమా ?

జ. లేదు

4.వేటిని ప్రింట్ తీసి pdf ద్వారా సమర్పించాలి ?

జ. స్పెషల్ కేస్ బిల్ కి మాత్రమే (అనగా ఇంక్రిమెంట్ , బడ్జెట్ , ఖర్చులు,ఏవైనా సర్టిఫికెట్ లు)వాటిని స్కాన్ చేయాలి.

5 . వేటిని ప్రింట్ తీయనక్కర్లేదు ?

జ. బిల్ షెడ్యూల్స్

6. ఒక ఆఫీస్ లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉంటే ?

జ. ఒకరు మేకర్, DDO సబ్మిటర్

7.ఒక ఆఫీసులో ఒక్కరే సిబ్బంది ఉంటే ?

జ. ఆయన DDO అయితే మేకర్,చెక్కర్,సబ్మిటర్ అన్నీ ఆయనే

8.DDO అందుబాటులో లేకపోయినా, అసలు ఆ ఆఫీస్ కి DDO లేకపోయినా ?

జ. అదే మండలంలోని వేరే ఆఫీస్/స్కూల్ యొక్క DDO ఆదరైజేసెషన్ తీసుకోవాలి.ఎందుకంటే కేవలం DDO ల బయో మెట్రిక్ మాత్రమే బిల్లులకు  పనిజేస్తుంది.

9. CFMS లో స్టాఫ్ జాబితా తప్పుగా ఉంటే ?

జ. CFMS సైట్ లోనికి లాగ్ ఇన్ అయ్యి QUERY లో కంప్లైంట్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం పొందవచ్చు.

10.ఎవరినైనా ADD/DELETE చేయాలంటే ?

జ. అది కూడా QUERY లో సబ్మిట్ చేయవచ్చు.

11.పాత విధానంలో ఉండీ, ఇప్పుడు తీసేసిన కొన్ని విషయాలు ?

జ. TBR అక్కర్లేదు, APTC ఫారం 101 ,47 , బాంక్ ఫారం , బెనెఫిషరీ అక్కర్లేదు.

12.ట్రెజరీ బ్యాంక్ లు అనే పదం ఉంటుందా ?

జ. ఉండదు. ఇప్పుడు ఏ బ్యాంక్ లో అయినా CHALLANS కట్టవచ్చు.

13. తప్పుగా బిల్ పంపితే ?

జ. UNIQUE నెంబర్ GENERATE అయ్యాక మళ్లీ అది CANCEL చేయబడదు.తప్పుగా పంపితే మరల సబ్మిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ FIFO(ముందు వచ్చినవి ముందుగా బయటికి)విధానంలో బిల్లులు ఆర్డర్ లో ఉంటాయి.

14.unique నెంబర్ అనగా ?

జ. ఇంతకు ముందు TBR లాంటిదే.కానీ ఈ సారి ఈ నెంబర్ రాష్ట్రంలో ఒక్కటే ఉంటుంది.

15.మేకర్, చెక్కర్,submitter లు ముగ్గురూ అవసరమా ?

జ. అక్కర్లేదు.కానీ సబ్మిటర్ కచ్చితంగా ఉండాలి.

16.ట్రెజరీ id లు ఉంటాయా ?

జ. ఉండవు.వీటి స్థానంలో CFMS ID లు వచ్చాయి.కానీ రెండూ అనుసంధానం చేయబడే ఉంటాయి.

17.ఒక్కో voucher కి ఒక బిల్లు సబ్మిట్ చేయాలా ? అన్నీ voucher లను కలిపి చేయవచ్చా ?

జ. ప్రస్తుతానికి ఒక voucher కి ఒక బిల్ అనే విధానం ఉంది.అలా ఎన్ని ఉంటే అన్ని బిల్లులు సమర్పించాలి.

18.నగదు ఎలా , ఎవరిచే చెల్లించ బడుతుంది ?

జ. బిల్లుకు అన్నీ సక్రమంగా ఉంటే సెంట్రల్ సర్వర్ ద్వారా E-KUBER కి జతచేసి RBI ద్వారా చెల్లించబడతాయి.15 నిమిషాల్లో బిల్ చేసి, అన్నీ PASS ON చేస్తే 16వ నిమిషంలో నగదు ఉద్యోగి యొక్క బ్యాంక్ ఖాతా కు జమ చేయబడతాయి.

19.ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో తప్పు ఉంటే ?

జ. అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే DDO లకు మెసేజ్ లు వెంటనే వస్తాయి.

20.CFMS విధివిధానాలు కి HELPLINE నెంబర్ ఉందా ?

జ. ఉంది. వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది.

Share on Facebook
Share on Twitter
Please reload

Featured Posts

ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వర్ట్యువల్ ఉత్సవం

June 4, 2020

1/9
Please reload

Recent Posts
Please reload

Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

  • Instagram Social Icon
  • twitter
  • facebook
  • pinterest
  • youtube
  • googlePlus
  • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,