అటవీ దళాధిపతి ని కలిసిన మినిస్టీరియల్ సిబ్బంది
ది.12-01-2018 న మన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) శ్రీ పి.మల్లికార్జున రావు, ఐ.ఎఫ్.ఎస్. వారిని గుంటూరు లో అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ పి.జ్యోతి కుమార్, ప్రధాన కార్యదర్శి వారికి మినిస్టీరియల్ సిబ్బంది కి పదోన్నతులు, కొన్ని డివిజన్ కార్యాలయాలలో సిబ్బంది కొరత, కొన్ని కార్యాలయాలలో సిబ్బందికి ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న విషయాల గురించి వివరించి చెప్పడం జరిగింది. దానికి వారు సానుకూలం గా స్పందించి, దీనిపై ఒక నివేదిక తయారుచేయించి సత్వరమే పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ జి.వి.సత్యనారాయణ, ప్రెసిడెంట్, శ్రీ కె. లోకనాథ్ బాబు, వైస్ ప్రెసిడెంట్, శ్రీ పి.జ్యోతి కుమార్, ప్రధాన కార్యదర్శి, PCCF ఆఫీసు నుండి శ్రీ ఎస్.సుబ్బా రావు, సూపరింటెండెంట్ తదితరులు హాజరైనారు.
Comments