top of page

అటవీ శాఖ-అవుట్ సోర్సింగ్ వేతన బకాయిలు చెల్లింపు

అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న సిబ్బంది కొన్ని మాసాలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి వేతన వెతలను తీర్చే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. వనరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంతో కృషికి చేస్తున్న ఈ సిబ్బంది కొన్ని మాసాలుగా జీతాలు అందక కష్టాలు పడుతున్న పరిస్థితిని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) ఎన్ ప్రతీప్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కుటుంబపోషణ కూడా కష్టంగా మారిన నేపథ్యంలో ఈ సిబ్బందిని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంపా (CAMPA) స్కీం కింద వేతన బకాయిల తక్షణ చెల్లింపులకు గాను రూ. 9 కోట్ల 21 లక్షల 91 వేల 700 రూపాయలను పిసిసిఫ్ ప్రతీప్ కుమార్ విడుదల చేసారు. ఇందులో భాగంగా రాజమండ్రి అటవీ సర్కిల్ కు రూ.1,80 ,80 ,900 మంజురైనాయి. 2020 మార్చి నుంచి జూన్ నెల వరకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బకాయి ఉన్న నాలుగు నెలల జీతాలను ఈ నిధులతో చెల్లించడం జరుగుతుందని రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు తెలిపారు. సర్కిల్ పరిధిలోని కాకినాడ డివిజన్ కు 6459600 , ఏలూరు డివిజన్ కు 3886600 , కృష్ణా డివిజన్ (విజయవాడ)కు 1213700 , చింతూరు డివిజన్ కు 3240900 , వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ డివిజన్ (రాజమండ్రి) కి 477100 , వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ డివిజన్ (ఏలూరు) కు 2176500 , స్టేట్ సిల్వి కల్చరిస్ట్ (రాజమండ్రి)కి 626500 చొప్పున కంపా నిధులను వనసంరక్షణాధికారి ఎన్. నాగేశ్వరరావు మంజూరు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని ఆయన డివిజనల్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం మానవతాదృక్పథంతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపునకు తీసుకున్న సత్వర చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖలో ప్రొటెక్షన్ వాచర్లు, బేస్ క్యాంపుల సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్సు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న వేలాదిమంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ నిర్ణయం వలన లబ్ధి చేకూరుతుంది.

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page