కొత్త జీవన విధానం దిశగా సాగాలి - ఉపరాష్ట్రపతి పిలుపు

భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనా కాలంలో నూతన జీవనశైలిని అవలంబించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అదే విధంగా కరోనాను ఎదుర్కొనే దిశగా 12 సూచననతో కూడిన సరికొత్త సాధారణ జీవనశైలిని తెలియజేశారు. కరోనా మహమ్మారి కొత్త పాఠాలు నేర్పించిందని, వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో జీవితం మరియు మానవత్వం పట్ల కొత్త వైఖరులు అవసరమని ఆయన ఉద్ఘాటించారు.

గత రాత్రి లాక్ డౌన్ 4.0 ప్రకటించి, పరిమితుతులను గణనీయంగా సడలించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఫేస్ బుక్ వేదికగా కోవిడ్ -19 మహమ్మారి విసిరిన తాత్విక, నైతిక సమస్యలను మరియు ఇక నుంచి జీవనశైలిని సాగించాల్సిన మార్గాన్ని తెలియజేస్తూ, వివరణాత్మక వ్యాసాన్ని రాశారు. ఇకపై ఒంటరిగా జీవించలేమని, వైరస్ వ్యాప్తి జీవితం యొక్క పరస్పర అనుసంధానతను చూపించిందని ఆయన నొక్కి చెప్పారు. “ఒక వ్యక్తిని ఎక్కడైనా ఏదైనా ప్రభావితం చేస్తే, అది ప్రతి ఒక్కరినీ ప్రతిచోట ప్రబావితం చేస్తుంది, అది వ్యాధి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు” అనే విషయాన్ని ప్రధానంగా తెలియజేశారు.

కరోనాకు ముందు జీవిత స్వభావం గురించి వివరించిన ఉపరాష్ట్రపతి, కుటుంబాన్ని మరియు సమాజాన్ని అనుబంధంలోని ఆనందాన్ని ఆస్వాదించకుండా, ఆనందం మరియు భౌతిక పురోగతి కోసం తపన పడుతూ మనిషి ఒంటరిగా ఉన్నాడని, అహంకారమే హద్దుగా సమాజాన్ని పట్టించుకోకుండా ఒంటరి జీవితాన్ని గడిపాడని తెలిపారు. జన్యు మార్పిడి, కృత్రిమ మేధ, బిగ్ డేటా లాంటి వాటి ద్వారా సృష్టికి ప్రతి సృష్టి చేసిన మనిషి, అంటు వ్యాధులతో పోరాడడానికి మెరుగైన సాధనను అవలంబిస్తున్నాడని తెలిపారు.

కరోనా తర్వాత జీవితం గురించి రాసిన ఉపరాష్ట్రపతి, అది స్వయంగా జీవనానికి సంబంధించిన కనీస అంశాలను తెలియజేసిందని, తోటి మానవులతో సామరస్యంగా జీవించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపారు. కంటికి కనిపించని సూక్ష్మ జీవి, జీవితం చాలా త్వరగా మారుతుందని మరో సారి రుజువు చేసిందని, ఇది జీవితంతో కలిసి ప్రయాణించగల అనిశ్చితిని పూర్తి స్థాయిలో తీసుకువచ్చిందని తెలిపారు.

ప్రకృతి మరియు సమానత్వం మీద, అలాగే తోటి జీవులతో సంబంధాల స్వభావం మరియు ప్రస్తుత అభివృద్ధి మార్గాలతో అనుసంధానమైన నైతిక సమస్యలతో సహా జీవిత పరమార్థం గురించి కరోనా మహమ్మారి అనేక ప్రశ్నలు లేవనెత్తిందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. వైరస్ ప్రభావం నేపథ్యంలో అభివృద్ధి చెందిన సమాజంలో ఆర్థిక అసమానతల పరిణామాలను ఎత్తి చూపిందని అభిప్రాయపడిన ఆయన, ఈ అనిశ్చితి ప్రజలను వెంటాడుతూనే ఉందని, ఈ ఆందోళన మానసిక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రశాంతంగా ఉంటూ, ఆత్మ విశ్వాసంతో కూడిన కొత్త సాధారణ జీవ విధానాన్ని అవలంబించాలని సూచించారు.

ఏదైనా నాగరికత లక్ష్యం, మానవులు మనుగడ అవకాశాలను పెంచడం అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, కరోనా విసురుతున్న సవాళ్ళు వ్యక్తిగత సమస్యలు కావని, అవి నాగరికతకు సంబంధించిన సవాళ్ళ అని, ప్రస్తుత నాగరికతను కాపాడుకునేందుకు కొత్త నియమాలు, మరియు జీవనశైలిని అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

జీవితాన్ని ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచలేమన్న ఉపరాష్ట్రపతి, గత రాత్రి ప్రకటించిన లౌక్ డౌన్ 4.0 సడలింపులను స్వాగతించారు. అలవాట్లను మార్చుకోవడం ద్వారా టీకా లేని హెచ్.ఐ.వి. లాంటి వైరస్ లను దూరం చేసిన ప్రజలను ప్రస్తవిస్తూ, జీవితం పట్ల మరియు తోటి మానవుల పట్ల అలవాట్లు మరియు వైఖరిని మార్చుకోవడం ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించినప్పటికీ ఈ కరోనా వైరస్ ను ఎదుర్కొవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కరోనా నేపథ్యంలో 12 అంశాల సరికొత్త సాధారణ జీవనశైలిని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రకృతి మరియు తోటి జీవులకు అనుగుణంగా జీవించడం, జీవితాల భద్రత మరియు భద్రత ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉన్నాయని తెలుసుకోవడం, వైరస్ వ్యాప్తి పై ప్రతి కదలిక లేదా చర్య ప్రభావాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం, పరిస్థితికి హఠాత్తుగా స్పందించపోవడం, బదులుగా విజ్ఞాన శాస్త్రం మీద విశ్వాసం ఉంచడం సమస్యకు పరిష్కారాలతో ముందుకు రాగలదని తెలిపారు. అదే విధంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించడం వంటి ప్రవర్తన మార్పులకు గట్టిగా కట్టుబడి ఉండాలని, భాదితుల మీద, చికిత్స అందిస్తున్న స్వచ్ఛంద సేవలకు మీద వచ్చే సమాచారం, పుకార్లను నమ్మకపోవడం, వైరస్ ఒక్క వాహకాలు మరియు సామూహిక నిస్సహాయత భావాన్ని భాగస్వామ్య విధితో పరస్పరం అనుసంధానించబడిన జీవన ధర్మం యొక్క ఆత్మ ద్వారా భర్తీ చేయాలని సూచించారు.

వైరస్ మరియు వ్యాధి గురించి భయాందోళనలను ప్రచారం చేయకుండా సరైన మరియు శాస్త్రీయ సమాచారాన్ని ప్రసారం చేయాలని మీడియా సంస్థలను ఆయన కోరారు.

"భిన్నంగా జీవించండి మరియు సురక్షితంగా జీవించండి" అంటూ ప్రజలకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

Featured Posts

Recent Posts
Follow Us
 • YouTube Social Icon
 • Instagram Social Icon
 • Facebook Basic Square
 • Twitter Basic Square
 • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

 • Instagram Social Icon
 • twitter
 • facebook
 • pinterest
 • youtube
 • googlePlus
 • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,