ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వర్ట్యువల్ ఉత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నగర వనం పేరిట జూన్ ఐదవ తేదీ శుక్రవారం నాడు ఆన్లైన్ లో వర్ట్యువల్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవం జూన్ ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి గంట పది నిముషాల పాటు జరగనుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణం మార్పుల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రకాష్ జవదేకర్ ముఖ్యఅతిథిగా, సహాయమంత్రి శ్రీ బాబుల్ సుప్రియో గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ప్ర్రత్యక్షముగా (లైవ్ లో) వీక్షించడానికి ఈ క్రింది లింక్ కు కనెక్ట్ కావాలి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాధిపతి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ ఎన్ ప్రతీప్ కుమార్ అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. ఈ వర్ట్యువల్ సెలబ్రేషన్ ను కనీసం లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా దోహదపడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇందుకోసం ఈ కార్యక్రమ వివరాలను రేంజి స్థాయి వరకూ అటవీ సిబ్బంది , మ్యునిసిపల్ అధికారులు, కాలుష్య నివారణ బోర్డులు, స్వచ్చంద సంస్థలు , పరిశ్రమల నిర్వాహకులు .. ఇలా అందరికీ తెలియపర్చాలని శ్రీ ప్రతీప్ కుమార్ కోరారు.
https://www.youtube.com/channel/UCCl94zd6YfuUrv9DJz_5RcA