top of page

కరోనాను జయించాలంటే - పారిశుద్ధ్యాన్ని పాటించాలి

పారిశుద్ధ్యాన్ని మన సంస్కృతిలో భాగంగా మలచుకున్నట్టయితే ఈ కరోనా మహమ్మారి ప్రభావం అంతగా ఉండదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాకు దగ్గరగానే ఉన్నప్పటికీ జపాన్‌లో ఈ మహమ్మారి ప్రభావం అంత ఉద్ధృతంగా లేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడి వారి పరిశుభ్రతే. అందుకే మనం కూడా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను మన సంస్కృతిలో భాగంగా చేసుకుంటే ఈ కరోనా మనల్ని ఏమి చేయలేదు. కరోనా ప్రబలిన రోజుల్లోనే మాస్కులు ధరించడాన్ని మనం చూస్తున్నాం. కానీ, సాధారణ జలుబు వంటి రుగ్మతలు వచ్చినప్పుడు కూడా తప్పని సరిగా మాస్కు ధరించెలా అందరికీ అవగాహన కలిగించాలి. ఈ క్రింది విధంగా చేయగలిగితే మన దేశంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎలాంటి వైరస్ రాదని చెప్పవచ్చు.

[if !supportLists]1. .[endif]చిన్ననాటి నుంచే మన పిల్లలకు పరిసరాల పరిశుభ్రతను అలవాటు చేయాలి. దేశవ్యాప్తంగా పాఠశాలలన్నింటిలోనూ ప్రతిరోజు టైమ్‌టేబుల్‌ లో పారిశుధ్ధ్యానికి సంబంధించి ఒక క్లాస్ ఉండాలి. విద్యార్థులచే తరగతి గది శుభ్రం చేయడం, కారిడార్లు, మెట్లు కడగడ౦, మరుగుదొడ్లు శుభ్రం చేయడ౦ లాంటిపనులు చేయించాలి.

[if !supportLists]2. [endif]తల్లిదండ్రులు కూడా విధిగా తమ చిన్నారులకు పారిశుద్ధ్యం గురించి చెప్పాలి. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తమ పాదరక్షలను బయటే విప్పి లోపలికి వెళ్లేలా చూడాలి.

[if !supportLists]3. [endif]బహిరంగ ప్రదేశాలలో ధూమపానం, మధ్యపానం లాంటి వాటిని కట్టడి చేయాలి. అసలు ఈ రెంటినీ పూర్తిగా నిషేదించితే మంచిది.

[if !supportLists]4. [endif]ప్రజలు అందరూ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.

[if !supportLists]5. [endif]రాజకీయ సభలు, క్రీడా ప్రాంగణ౦ సంగీత కచేరీలు, పెళ్లిళ్లు వంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడూ చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీలోనే వేసే అలవాటు చేసుకోవాలి.

[if !supportLists]6. [endif]కార్యాలయలలో పని చేసే సిబ్బంది తమ కార్యాలయాలను, అలాగే పరిసర ప్రాంతాలను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. అలాగే దుకాణ సిబ్బంది తమ పరిసరాల్లోని వీధులను శుభ్రం చేసుకోవాలి, ప్రతి కాలనీలోనూ ఆ కాలనీలవాసులు క్రమం తప్పకుండా వీధులను శుభ్రం చేసుకునే కార్యక్రమాలను తమ రోజువారీ జీవితంలో భాగంగా నిర్వహించాలి.

[if !supportLists]7. [endif]అలాగే, ప్రస్తుత పరిస్తితులలో నోట్లు కూడా ఈ వైరస్ ను ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చేయవచ్చు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ మనీ వాడేలా చర్యలు తీసుకోవాలి. కానీ మనదేశంలోని నిరక్షరాస్యత వల్ల అది సాధ్యం కాక పోతే, అన్నీ దుకాణాలు, హోటళ్లు లాంటి ప్రదేశాలలో డబ్బును నేరుగా ఎవరి చేతులోనూ పెట్టకుండా ఏదైనా ప్రత్యేక ట్రేలు, డబ్బాలు ఏర్పాటు చేసుకునే చర్యలు తీసుకోవాలి.

[if !supportLists]8. [endif]జలుబు, ఫ్లూ ఉన్నవారు తప్పనిసరిగా సర్జికల్‌ మాస్కులు ధరించాలి. ఈ ఇన్‌ఫెక్షన్‌ ఇతరులకు వ్యాప్తి చేయకూడదన్న సామాజిక స్పృహ ప్రతివారిలోనూ ఉండాలి. ఈ చిన్న సూత్రం వల్ల వైరస్‌ల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అనారోగ్యంతో కోల్పోయే పనిదినాలు, వైద్య ఖర్చులు వంటి అంశాలపరంగా దేశానికి బోలెడు సొమ్ము ఆదా అవుతుంది.

9. మాస్కులు, శానిటైజర్లు అన్ని సూపర్‌ మార్కెట్లలోను, కిరాణా దుకాణాల్లో విరివిగా అందుబాటులో ఉండేలా చూడాలి లేదా ప్రతి ఇంటికి ఉచితంగా అందించే ఏర్పాటు చేయాలి.

Comments


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page