రేపటినుంచి దేశంలో రైళ్ళు నడవనున్నాయి
Railway workers spray disinfectants to mitigate the coronavirus pandemic at MGR Central Railway Station, in Chennai. (PTI)
రేపటి నుంచి దేశంలో 15 జతల రైళ్లను (అప్ అండ్ డౌన్ కలిపి 30 రైళ్లు) ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇవి కొత్తదిల్లీ రైల్వేస్టేషన్ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హౌరా, పట్నా, బిలాస్ పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్ గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడుస్తాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్ సీటీసీ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమవుతాయి. కేవలం ఈ వెబ్ సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి. రైల్వేస్టేషన్లలో టికెట్ల కౌంటర్లు తెరవరు. కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లలోకి అనుమతిస్తారు. స్క్రీనింగ్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు గంట ముందుగా స్టేషన్ కు రావాలి. ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు. టికెట్లపై ఎలాంటి రాయితీలు ఇవ్వబోరు. ఇవన్నీ ఏసీ రైళ్లే. సూపర్ ఫాస్ట్ రైళ్ల ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఏసీ రైళ్లలో ప్రయాణికులకు బెడ్ షీట్లు, దుప్పట్లు ఇవ్వరు. సాధారణం కన్నా కాస్త ఎక్కువ ఉష్ణోగ్రత ఉంచుతారు.
Comentarios