top of page

మన జీవనశైలి మార్చుకోవాల్సిన తరుణం

ప్రియమైన మిత్రులారా, దయచేసి ప్రభుత్వం కొంత సమయం మాత్రమే లాక్డౌన్ చేయగలదని గమనించండి. లాక్డౌన్ నెమ్మదిగా ముగుస్తుంది. ప్రభుత్వం కూడా అలాంటి కఠినతను ఎంతోకాలం చూపించదు. ఎందుకంటే ఇప్పటికే కరోనా వ్యాధి, సామాజిక దూరం, చేతి పరిశుభ్రత మొదలైన వాటి గురించి ప్రభుత్వం మీకు అవగాహన కల్పించింది. మీరు కూడా పరిస్థితిని చూస్తున్నారు. ఇప్పుడు తెలివిగల వారు, వారి దినచర్యలో ఎలాటి మార్పులు రావాలో వారే అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వం మీకు 24 గంటలు 365 రోజులు కాపలా కాదు. మీ మరియు మీ కుటుంబం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. లాక్డౌన్ తెరిచిన తరువాత, జాగ్రత్త వహించండి. మీరు ఇంటిని వదిలి కార్యాలయానికి వెళ్లి నిబంధనల ప్రకారం మీ పని చేయాల్సి ఉంటుంది. మే 17 తరువాత, కరోనా అకస్మాత్తుగా వెళ్లిపోతుంది, మేము మునుపటిలా జీవించడం ప్రారంభిస్తాము అని అనుకుంటున్నారా? అలా కానే కాదు . ఈ వైరస్ మన దేశంలో పాతుకుపోయింది, దానితో జీవించడం నేర్చుకోవాలి. ఎలా? లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎంతకాలం ఉంచుతుంది? నిష్క్రమణ ఎంతకాలం నిషేధించబడుతుంది? ఇప్పుడు మన జీవనశైలిని మార్చడం ద్వారా, మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఈ వైరస్‌తో మనమే పోరాడాలి. ఇప్పుడు మనము వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పాటించిన జీవన శైలిని అవలంబించాలి. స్వచ్ఛమైన ఆహారం తినండి, స్వచ్ఛమైన మసాలా దినుసులు తినండి. ఉసిరి, కలబంద, తిప్ప తీగ, మిరియాలు, లవంగాలు మొదలైన వాటిని మన ఆహార పానీయాలలో భాగం చేసుకోండి. ప్రతి చిన్న చిన్న అనారోగ్యానికి యాంటీ బయోటిక్స్ వాడడం మానండి. మీరు మీ ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్, శీతల పానీయాలను మరచిపోండి. మనం వంట పాత్రలను కూడా మార్చుకోవాల్సి ఉంది, అల్యూమినియం, స్టీల్ పాత్రలను వదిలి ఇత్తడి, కాంస్య, రాగి మొదలైన లోహాలతో చేసిన వ౦టపాత్రలను వాడడం ప్రారంబించాలి, ఇవి సహజంగా వైరస్నులను దరిచేరనీయవు. మీ ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి లను అధికంగా వాడడం మంచింది. ఇకపై మరచిపొండి హోటల్ నుండి తెచ్చుకున్న రుచులను, మసాలాలు వేసి వేయించిన తినుబండారాల చెత్తను. ఇంకా మనం 7-8 నెలల పాటు ఈ విధమైన జాగ్రతలు తీసుకోవాలి. అప్పుడే మనం మనుగడ సాగించగలం. ఇంకా ఇప్పటికీ మారని వారు ఇబ్బందుల్లో పడతారు. ఇది నిజం అని రంభించండి.

అని మీరు నమ్మితే - ఇక వీటిని అమలు చేయడం ప్రారంభించండి. ఆ పై ఇక మీ నిర్ణయం! రోగనిరోధక శక్తిని పెంచుకోడం ద్వారా సురక్షితంగా ఉండండి !!! ??

Featured Posts