అటవీశాఖ ఉద్యోగులకు బహుళ నైపుణ్యాలు అవసరం :అటవీ దళాధిపతి
అటవీ సంపదను కాపాడడంలో శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బంది బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ది.30-12-2017 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అకాడెమీ లో జరిగిన మొదటి బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారుల స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ పి.మల్లికార్జునరావు, ఐ.ఎఫ్.ఎస్. రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) అన్నారు. భవిష్యత్ తరాలకోసం పనిచేస్తున్న అటవీశాఖలో మీరు ఉద్యోగులైనందుకు మీరు గర్వపడాలని అటవీశాఖలో పనిచేసే ఉద్యోగులకు బహుళ నైపుణ్యాలు ఉండటం అవసరమని చెప్పారు. అతి తక్కువ కాలంలో ముఖ్య అటవీ సంరక్షణాధికారి, రాజమహేంద్రవరం శ్రీ జె.ఎస్.ఎన్.మూర్తి గారు ఈ అకాడెమీని చక్కగా తీర్చిదిద్దారని చెప్పరు. ఈ అకాడెమీ కి కావలసిన అన్నీ మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ జె.ఎస్.ఎన్.మూర్తి, ఐ.ఎఫ్.ఎస్. ముఖ్య అటవీ సంరక్షణాధికారి, రాజమహేంద్రవరం మాట్లాడుతూ ఉద్యోగుల స్థైర్యాన్ని పెంచేందుకు శిక్షణలు బాగా ఉపయోగపడతాయని, ఉద్యోగులందరు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతకతను ఆకళింపుచేసుకుని మరింత సమర్ధవంతంగా తమ విధులను పూర్తి చేయవలసి ఉంటుందని ఉద్ఘాటించారు. తదుపరి అకాడమీ లో శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులకు సర్టిఫికట్ లు అటవీ దళాధిపతి శ్రీ పి. మల్లికార్జునరావు, ఐ.ఎఫ్.ఎస్. ప్రదానం చేసారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన వారికి బంగారు పథకాలు అందచేశారు. అనంతరం అకాడమీని పరిశీలించిన అటవీ దళాధిపతి సూచనలు సలహాలు ఇచ్చారు.
Comments