top of page

కరువు భత్యం (డీఏ) 2.09 శాతం పెంపు

పదో వేతన సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) 2.09 శాతం పెంచినట్లు (22.008 శాతం నుంచి 24.1014కు) మార్చి జీతంతో కలిపి ఏప్రిల్‌ నెలలో చెల్లించనున్నారు. 2017 జనవరి 1 నుంచి 2018 ఫిబ్రవరి 28 వరకు డీఏ బకాయిలను పీఎఫ్‌ ఖాతాల్లో ఏప్రిల్లో చేస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జి.ఓ.ఎం.ఎస్. సం.27, ది.28-02-2018 న విడుదల చేసింది.

జూన్‌ 30లోపు రిటైరయ్యే ఉద్యోగుల డీఏ బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. 2004 సెప్టెంబరు 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఉద్యోగులకు 2017 జనవరి 1 నుంచి 2018 ఫిబ్రవరి 28 వరకు గల బకాయిల్లో 10 శాతం ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ అకౌంట్లలో జమచేసి మిగిలిన 90 శాతం బకాయిలను నగదు రూపంలో ఏప్రిల్‌ నుంచి చెల్లిస్తారు. మార్కెట్‌ కమిటీలు, గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌, విజయవాడ కార్పొరేషన్‌ ఉద్యోగులకు ఆయా సంస్థల సొంత నిధుల నుంచి డీఏను చెల్లించాల్సి ఉంటుంది. యూజీసీ స్కేల్స్‌ ప్రకారం జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 132 శాతం నుంచి 136 శాతం పెంచారు. వీఆర్‌ఏలకు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు పారితోషికాన్ని నెలకు రూ.300 పెంచుతూ కూడా ఆదేశాలిచ్చారు.

పై జి.ఓ.ను దిగుమతి చేసుకోవాలంటే ఈ క్రింది లింకు పై క్లిక్ చేయండి: https://drive.google.com/file/d/1fFIHcUDuRu7hyUS-h3e-FE3QDJ2DymgA/view

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page