తిరుపతి లో APFSA సభ్యులకు వసతి
తిరుపతి లో మన అసోసియేషన్ సభ్యుల కొరకు ఒక వసతి ఏర్పాటు చేయుటకు ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి), ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు వారి ఉత్తర్వులననుసరించి తిరుపతి బయో ట్రిమ్ లో ఖాళీ గా ఉన్న ఒక బిల్డింగ్ కేటాయిస్తూ శ్రీ జి.నాగేశ్వర రావు, ఐ.ఎఫ్.ఎస్., స్టేట్ సిల్వికల్చరిస్ట్, తిరుపతి వారు ఈ రోజు వారి లేఖ సం.185/1997/s1, ది.31-01-2019 లో అనుమతి మంజూరు చేసినారు. ఈ సందర్భ౦గా మన అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు గారు చిత్తూరు జిల్లా సభ్యులను అభినందించారు. అంతే కాక ఇందుకు సహకరించిన అటవీ దళాధిపతి డా||మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, ఐ.ఎఫ్.ఎస్., శ్రీ ఎస్.శరవణన్, ముఖ్య అటవీ సంరక్షణాదికారి, తిరుపతి మరియు స్టేట్ సిల్వికల్చరిస్ట్, తిరుపతి వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
Comments