మీరు ఏం కోల్పోతున్నారో మీకు తెలుసా?
ముఖ్య గమనిక: ఈ క్రింద వ్రాసినదంతా చదివే ఓపిక మీకు లేకపోతే మీరు ఏం కోల్పోతున్నారో మీకు తెలియదు.
మనం DDO రిక్వెస్ట్ ఓపెన్ చేయగానే కనపడే ఒక పాప్ అప్ ఈ క్రింద తెలుగు లోకి తర్జుమా చేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రం లోని ఉద్యోగస్తులలో 49 వేలకు పైగా ఉద్యోగులు తాము చెల్లిస్తున్న భీమా ప్రీమియం కంటే తక్కువ మొత్తానికి మాత్రమే తమ అప్లికేషన్ పంపి౦చినట్టుగా తెలుస్తోంది. అందులో పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు 12 వేలకు పైగా ఉండగా, విద్యా శాఖలో పనిచేస్తున్న వారు 14 వేలకు పైగా ఉన్నారు. ప్రభుత్వం తమ వంతుగా మనకు ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియ జేస్తున్నది. ఏమిటంటే, GOMs.36 ఫైనాన్స్ (Admn.DI & IF) విభాగం, తేదీ 5.03.2016 పారా 9 ప్రకారం, రాష్ట్రంలో డ్రాయింగ్ మరియు డిస్పార్సెసింగ్ ఆఫీసర్లు అందరూ 2016 మార్చి నాటికి అన్ని అర్హతలు కలిగిన ఉద్యోగుల (55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) నుండి పునరుద్ధరించిన ప్రీమియం రికవరీకి బాధ్యత వహి౦చవలసి ఉంది. 2016 మార్చి లో అనగా ఏప్రిల్లో 2016 లో చెల్లించే జీతము నుండి ప్రీమియం రికవరీ చేసి తదనుగుణంగా అవసరమైన ప్రతిపాదన ఫారాలను ఫార్వార్డ్ చేయటం మరియు భీమా శాఖ నుండి అవసరమైన పోలసీ బాండ్స్ పొందడం తప్పనిసరి.
దీని ప్రకారం, కొంతమంది రాష్ట్రంలో డ్రాయింగ్ మరియు డిస్పార్సెసింగ్ ఆఫీసర్లు మాత్రమే ప్రీమియం రికవరీలను అమలుచేశారు కాని ఇప్పటివరకు ఆ పాలసీ బాండ్లను సంపాదించడానికి స్థానిక APGLI జిల్లా కార్యాలయాలకు అవసరమైన ప్రతిపాదన పత్రాలను సమర్పించలేదు. ఈ పరిస్థితిలో, ప్రతిపాదన ఫారమ్ సమర్పించకుండా ఏ ఉద్యోగి అయినా మరణించినప్పుడు APGLI నుండి ప్రస్తుతం ఎంత మొత్తానికి పాలసీ బాండ్ల ను పొందారో అంత మొత్తానికి మాత్రమే బీమా ప్రయోజనం లేకుండా చెల్లించబడుతుంది. అధికంగా చెల్లిస్తున్న మొత్తాన్ని అనధికారికంగా పరిగణించడం జరుగుతుంది మరియు బీమా ప్రయోజనం చెల్లించబడదు. ఈ విషయము పై ఏర్పడు చట్టపరమైన సమస్యలకు APGLI ఏవిధమైనా బాధ్యతా వహించదు. బీమా క్లెయిమ్ల పై లావాదేవీలకు డ్రాయింగ్ మరియు డిస్పార్సెసింగ్ ఆఫీసర్లు మాత్రమే సంబంధిత ఉద్యోగి/ఉద్యోగుల యొక్క ఆర్థిక నష్టానికి పూర్తిగా వహి౦చవలసి వస్తుంది. అందువల్ల, భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలను తగ్గించడానికి మరియు ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కల్పించడానికి, D&DO ల ద్వారా ప్రతిపాదన రూపంలో పెండింగ్లో ఉన్న మొత్తంకు, APGLI పాలసీ బాండ్లను జారీచేయడానికి, ప్రాంతీయ జిల్లా APGLI కార్యాలయానికి ప్రతిపాదన పత్రాలను సమర్పించండి.
ప్రభుత్వము వారు ప్రకటించిన జాబితా ప్రకారం ఈ క్రింది పట్టికలో చూపిన విధంగా ఆయా శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు వారు చెల్లిస్తున్న భీమా ప్రీమియం కంటే తక్కువ మొత్తానికి మాత్రమే వారి అప్లికేషన్ పంపి౦చినట్టుగా తెలుస్తోంది. కనుక, ప్రతి కార్యలయం వారి వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల నుండి వారు చెల్లిస్తున్న ప్రీమియం కు సరిపడా ప్రతిపాదన పత్రాలను పూరించి, మీ D&DO ద్వారా ప్రతిపాదన రూపంలో పెండింగ్లో ఉన్న మొత్తంకు, APGLI పాలసీ బాండ్లను జారీచేయడానికి, ప్రాంతీయ జిల్లా APGLI కార్యాలయానికి ప్రతిపాదన పత్రాలను సమర్పించండి. అప్లికేషన్ ఫామ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. Download
Comments