top of page

అసోసియేషన్ 2020 కాలె౦డర్ ఆవిష్కరణలు


మన అసొసియేషన్ 2020 కాలె౦డర్ ను ఈ రోజు అనగా జనవరి 1, 2020 నాడు రాష్ట్రం నలుమూలలా ఆవిష్కరింపచేసి మన సభ్యులకు పంపిణీ చేయుట జరిగి౦ది. వివరాలలోకి వెళ్తే, మొదటగా అటవీ శాఖామాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మన సభ్యులు శ్రీ ఎం. కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

మన ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) శ్రీ ఎన్.ప్రతీప్ కుమార్, ఐ.ఎఫ్.ఎస్. ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మన వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ, విమెన్ వింగ్ కో-అర్దినటర్ శ్రీమతి పద్మావతి మరియు ప్రధాన కార్యాలయ సిబ్బంది, తదితర సభ్యులు పాల్గొన్నారు. కర్నూల్ సర్కిల్ కార్యాలయం లో శ్రీ కె. గోపినాద్, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు, జనరల్ సెక్రటరీ శ్రీ మొహమ్మద్ ఆహెసాన్, శ్రీ జ్యోతి కుమార్, శ్రీ నాగేంద్ర వరకుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. విశాఖ పట్నం సర్కిల్ కార్యాలయం లో శ్రీ రాహుల్ పాండే, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన సభ్యులు శ్రీమతి పద్మాక్షి, మేనేజర్, శ్రీ కే.ఎస్.నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి (వన్యప్రాణి) సర్కిల్ కార్యాలయం లో శ్రీ ఎస్. శరవణన్, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన సభ్యులు శ్రీ లోక్ నాద్ బాబు, సూపరింటెండెంట్, శ్రీ సి.వి.రమణ, శ్రీ ధనుంజయ్ రెడ్డి, శ్రీ ఎన్. వి. రమణ, శ్రీ రవి నాయక్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

శ్రీశైలం టైగర్ ప్రోజెక్ట్ సర్కిల్ కార్యాలయం లో శ్రీ ఎన్. నాగేశ్వర రావు, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన సభ్యులు శ్రీ కె. ఉమా మహేశ్వరరావు తదితర సభ్యులు పాల్గొన్నారు.

గుంటూరు సర్కిల్ అటవీ స౦రక్షణాధికారి శ్రీ పి.శ్రీనివాస శాస్త్రి, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రాము, అక్కౌంట్స్ ఆఫీసర్ గారు తదితర కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా ప్రతి డివిజన్ కార్యాలయం లోనూ ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ డివిజన్ కార్యాలయం లొ డా. నందనీ సలారియా,ఐ.ఎఫ్.ఎస్., డివిజనల్ అటవీ శాఖాధికారి మరియు శ్రీ అనంత్ శంకర్, ఐ.ఎఫ్.ఎస్. వన్యప్రాణి విభాగం, రాజమండ్రీ ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి యూనిట్ సభ్యులు శ్రీఎం.జె.వి.ఎస్.ఆర్. వర్మ, సూపరింటెండెంట్, శ్రీ రాధాకృష్ణ, సీనియర్ అసిస్టెంట్, శ్రీ వి.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు డివిజన్ కార్యాలయం లొ శ్రీ పి.రామకృష్ణ, ఐ.ఎఫ్.ఎస్., డివిజనల్ అటవీ శాఖాధికారి ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి యూనిట్ సభ్యులు శ్రీW.రామమోహన రావు, మేనేజర్, శ్రీ పి.సుబ్బారావు, టెక్నికల్ అధికారి, శ్రీ బి.హెచ్.ఎన్.వి. శివకుమార్, సీనియర్ అసిస్టెంట్, శ్రీ నాంచారి బాబు, సీనియర్ అసిస్టెంట్, శ్రీ సాకా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్, శ్రీమతి వేణి, సీనియర్ అసిస్టెంట్, శ్రీమతి నాజ్, సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ డివిజన్ కార్యాలయం లొ శ్రీ కె.వినోద్ కుమార్, డివిజనల్ అటవీ శాఖాధికారి ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా యూనిట్ సభ్యులు శ్రీ వి.సత్యనారాయణ, శ్రిమతి సుశీలమ్మ, శ్రీ బ్రహ్మేశ్వర రావు,సీనియర్ అసిస్టెంట్ శ్రీ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్, శ్రీ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు. అలాగే ఆత్మకూరు డివిజన్, శ్రీకాకుళం డివిజన్, మార్కాపురం డివిజన్, గిద్దలూరు డివిజన్, నంధ్యాల డివిజన్లలో కుడా ఇదే విధంగా 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించినట్లు గా తెలియజేసారు.

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page