శ్రీమతి పద్మావతి, సూపరింటెండెంట్ గారికి అభినందనలు
ఇటీవల మలేషియా, కూచింగ్ లో జరిగిన ఆసియన్ మాస్టర్సు అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలలో శ్రీమతి దువ్వూరి పద్మావతి, సూపరింటెండెంట్, ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి వారి కార్యాలయం, గుంటూరు వారు మన భారత దేశం తరపున షాట్ పుట్ లో బంగారు పతాకం సాధించి మన దేశ ప్రతిష్టను అదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ అటవీశాఖ గౌరవాన్ని ఇనుమడింప చేశారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతే కాదు ఈ పోటీలలో డిస్కస్ త్రో మరియు జావెలిన్ త్రో విభాగాలలో ఆడి నాల్గవ స్తానాన్ని సాధించడం జరిగింది. 2020 కెనడా లో జరగబోయే ప్రపంచ మాస్టర్ మీట్ కు ఎంపిక చేసారు. వీరికి ఈ రోజు మన ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి వారి కార్యాలయంలో ని మన మహిళా ఉద్యోగినులు అందరూ కలసి ఆమెకు చిరు సన్మాన సభ ఏర్పాటు చేసి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీమతి రాగమణి, శ్రీమతి పద్మజ, శ్రీమతి సీతా మహాలక్ష్మి, శ్రీమతి రాధికా రాణి తదితరులు పాల్గొని ఆమెను అభినందించారు. శ్రీమతి దువ్వూరి పద్మావతి గారికి మన ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.
Comentarios