top of page

COVID-19 (కరోనా వైరస్ వ్యాధి)ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నపదం "కరోనా". ఇప్పుడు అది మనల్ని భయపెట్టే స్తాయికి పెరిగిపోయింది. మనం అందరం విధి నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ఎందరినో కలవ వలసి ఉంటుంది. అలవాటు ప్రకారం వారితో కరచాలనం చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ, ప్రస్తుతం కరచాలనం (షేక్ హ్యాండ్) చాలా ప్రమాదకరం అని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెప్తోంది. వీలైనంత వరకు ఎవరికి దగ్గరగా ఉండవద్దు కనీసం ఒక మీటరు దూరం (Social Distance) పాటించడం శ్రేయస్కరం అని ప్రకటించింది. కనుక, వీలైనంతవరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన జాగ్రతలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుందాం, మన సమాజాన్ని సంరక్షిద్దాం.

అందుకోసం మనం ఈ వైరస్ వల్ల ఏంజరుగుతుందో, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ వైరస్ సోకినట్లు గుర్తినచ్చ వచ్చో, ఏ ఏ జాగ్రతలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటామో చెప్పడానికే ఈ ప్రయత్నం.

లక్షణాలు: కరోనావైరస్ వ్యాధి లక్షణాలు అభివృద్ధి చెందడానికి 1 నుండి 14 రోజులు పట్టవచ్చు. ముందు కరోనావైరస్ వ్యాధి (COVID-19) యొక్క సాధారణ లక్షణాలు జ్వరం, అలసట మరియు పొడి దగ్గు. చాలా మంది (సుమారు 80%) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా వ్యాధి నుండి కోలుకుంటారు.

చాలా అరుదుగా, ఈ వ్యాధి తీవ్రమై ప్రాణాంతకం కావచ్చు. వృద్ధులు, మరియు ఇతర అనారోగ్యలతో (ఉబ్బసం, మధుమేహం లేదా గుండె జబ్బులు వంటివి) ఉన్నవారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ క్రింది లక్షణాలు ఉంటే: ఎ. దగ్గు బి. జ్వరం సి. అలసట మరియు డి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తప్పనిసరిగా డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. కొంచెం కూడా అశ్రద్ద వద్దు. అలాగే మీ పక్క ఇంటిలో వారు లేదా మీకు తెలిసిన వారు ఎవరు ఈ పరిస్తితిలో ఉన్నారని తెలిసినా మీరు హెల్ప్ లైన్ నెంబర్ లు టోల్ ఫ్రీ : 1075; +91-11-23978046; ఆంధ్ర ప్రదేశ్ టోల్ ఫ్రీ నెం.0866-2410978 లకు తెలియజేయండి.


నివారణ: కరోనావైరస్ రూపుమాపడాని కి ఈ క్రింది విధంగా చేసి సహాయపడండి 1) చేతులు తరచుగా (ప్రతి గంటకు) కడుగుకోవాలి 2) దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఖచ్చితంగా జేబురుమాలు లేదా టిష్యూ పేపర్ గాని అడ్డు పెట్టుకోండి. 3) ముఖం, ముక్కు, కళ్ళను చేతులు కడుగకుండా తాకవద్దు 4) వ్యక్తుల మధ్య సురక్షితమైన దూరం పాటించండి. 5) వీలైనంత వరకు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి.

మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు మరియు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడవచ్చు: చేయవలసినవి: 1. సబ్బు మరియు నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ తో 20 సెకన్ల పాటు చేతులను క్రమం తప్పకుండా కడగాలి, 2. మీరు దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు మీ ముక్కు మరియు నోటిని కర్చీఫ్ లేదా మాస్క్ లేదా వంగిన మోచేయితో కప్పండి 3. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో (1 మీటర్ లేదా 3 అడుగులు) సన్నిహిత సంబంధాన్ని నివారించండి. 4. మీకు అనారోగ్యం అనిపిస్తే ఇంట్లో ఉండండి మరియు ఇంటిలోని ఇతరుల నుండి స్వచ్చందం గా వేరుగా ఉండండి చేయకూడనిది మీ చేతులు శుభ్రంగా లేకపోతే మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకండి.

చికిత్స: కరోనావైరస్ (COVID-19)వ్యాధిని నివారించడానికి గాని లేదా చికిత్స చేయడానికి గాని నిర్దిష్ట (medicine)ఔషధం లేదు. స్వీయ రక్షణ: మీకు తేలికపాటి లక్షణాలు ఉంటే, మీరు కోలుకునే వరకు ఇంట్లోనే ఉండండి. ఈ క్రింది విధంగా చేసినట్టయితే వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు: ఎ. బాగా నిద్ర పోడం లేదా విశ్రాంతి తీసుకోడం.

బి. శీతల ప్రదేశాలలో (AC) ఉండకుండా సి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు, జ్యూసులు, నీళ్ళు పుష్కలంగా త్రాగాలి డి. గొంతు నొప్పిని మరియు దగ్గును తగ్గించడానికి గదిలో తేమ ఉండేలా లేదా వేడి స్నానం చేయండి

ఇ. అల్లం ముక్కకు ఉప్పు అటించి బుగ్గన పెట్టుకొని నెమ్మది రసం మింగుతూ ఉండండి.

సర్వే జనాః సుఖినో భవన్తు.

Featured Posts