top of page

ఈ-ఎస్ఆర్ - ఉద్యోగుల భద్రతకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లను ఆగస్టు 31 నాటికి ఆన్లైన్ చేయించుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి అత్యంత కీలకమైనదే సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్). ఉద్యోగులు బాధ్యతలు చేపట్టిన రోజు నుండి వారి పదవీ విరమణచేసేంత వరకూ అన్ని అంశాలనూ ఉన్నతాధికారులు ఈ రిజిస్టర్ లో పొందుపరుస్తారు.


12 అంశాల్లో సమగ్ర సమాచారం :

'ఈ-ఎస్ఆర్' నిర్వహణలో భాగంగా 12 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో పాటు వాటికి సంబంధించిన ధృవీకరణపత్రాలను కూడా ఉద్యోగులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా ఆగస్టు 31 నాటికి ఈ-ఎస్ఆర్ ను ఆన్లైన్లో చేసుకోవాలి.


విభాగం-1 : ఉద్యోగి వ్యక్తిగత సమాచారం నమోదు. పేరు, చిరునామా, సర్వీస్, పోస్టు క్యాడర్, ఆధార్, ఎంప్లాయిస్ ఐడి, ఫోటోఆధార్ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు, విద్యార్హతలు, బ్యాంక్, పాన్, స్వగ్రామం, తదిత సమగ్ర సమాచారం ఉద్యోగి డిక్లరేషన్తో ఇవ్వాలి.


విభాగం-2:సర్టిఫికెట్ వివరాలు పొందుపరచాలి. వైద్యుల ధృవీకరణపత్రం, పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు, నామినీ, కుటుంబ సభ్యుల పెన్సన్ తదితర వివరాలకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్లోడ్ చెయ్యాలి.


విభాగం-3: ఈ విభాగంలో సర్వీస్ వివరాలు నమోదు చెయ్యాలి, జాయినింగ్, ప్రొబిషన్ కాలం, బదిలీలు, పదోన్నతులు, రిజర్వేషన్ తదితర వివరాలు ఉంటాయి.


విభాగం-4: ఉద్యోగికి సంబంధించిన జీతభత్యాల వివరాలు, పీఆర్సీ, కొత్త పింఛన్ పథకం వివరాలు అప్లోడ్ చేసుకోవాలి.


విభాగం-5 : ఉద్యోగికి వర్తించే అన్ని రకాల సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు పెన్సన్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.


విభాగం-6 : ఈ విభాగంలో రవాణా భత్యాలు (ట్రావెలింగ్ అలవెన్బు)లకు సంబంధించిన వివరాలుఉంటాయి.


విభాగం-7: ఉద్యోగి ఇంటి, కారు, కంప్యూటర్, వివాహ సంబంధిత అవసరాలకు ప్రభుత్వం నుండి పొందిన అడ్వాన్స్లు / రుణాలకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసుకోవాలి.


విభాగం-8 : గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం వివరాలు ఉంటాయి.


విభాగం-9 : సర్వీస్ తనిఖీలకు సంబంధించిన సమాచారం.


విభాగం-10: శాఖాపరమైన పరీక్షలు నిర్వహించిన సందర్భంలో హాజరైన వివరాలు


విభాగం-11: ఇంటెన్సివ్స్, శిక్షార్హమైన అంశాలు.


విభాగం-12: ఉద్యోగికి సంబంధించిన పెన్సన్ ప్రణాళికలు తదితరాంశాలు ఉంటాయి.


అన్నీ ప్రయోజనాలే..! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్) ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం వల్ల పలుమార్లు ఏదైనా శాఖలో ఊహించని విధంగా షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని కాపాడేందుకు ఎలాంటి రక్షణ చర్యలు ఉండేవి కాదు.


తాజాగా ఈ-ఎస్ ఆర్ ను ప్రారంభించడం వల్ల ఉద్యోగుల పదవీ కాలానికి సంబంధించిన అన్ని వివరాలూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.. ఇలా ఉండటం వల్ల ఉద్యోగి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పెన్సన్, జీతభత్యాలు, పదోన్నతలు, ఎప్పుడు ఎక్కడనుండి బదిలీ అయ్యింది. పూర్తి వివరాలు ఉంటాయి. వాటిని సంబంధితశాఖ ఉన్నతాధికారులు మాత్రమే నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది.


ఎస్ఆర్ ను మరి ఏ ఇతర అధికారి లేదా ఉద్యోగి తిరిగి రాసే అధికారం ఉండదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నూటికి నూరుశాతం భద్రతతో కూడిందనే చెప్పాలి.


అలాగే ఉద్యోగి పదవీ విమరణ చేసిన రోజే వారికి అందాల్సిన అన్ని సదుపాయాలు అదే రోజు చెల్లించే విధంగా ఈ-ఎస్ఆర్ ను దీర్చిదిద్దడం జరిగింది. ఇది ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పిస్తుందనేది నా అభిప్రాయం.


- ముద్దాడ రవిచంద్ర, ఐ.ఏ.ఎస్.,

ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి.

ఆంద్ర ప్రదేశ్

 

Comments


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

  • Instagram Social Icon
  • twitter
  • facebook
  • pinterest
  • youtube
  • googlePlus
  • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,

bottom of page