top of page

కేంద్రం ప్రతిపాదిస్తున్నF D R I BILL-2017

‘ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్‌ (2017)’(F D R I BILL) పై ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వ్యాసం.


ప్రస్తుతం మీడియాలో దుష్ప్రచారానికి లోనవుతున్న, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న బ్యాంకుల ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు ఏమిటి?

ఇప్పటి వరకూ దేశంలో ఏదైనా ప్రభుత్వ/ ప్రైవేట్ బ్యాంకు కాని, నాన్- బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (మార్గదర్శి/శ్రీరాం లాటివి) కాని మూసుకుపోయినా, దివాళా తీసినా ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలుగచేసుకుని నష్టపోయిన వినియోగదారులకి ఆ డబ్బుని ఎదో ఒక రూపంలో పూర్తిగా సర్దుబాటు చేసేది. ఏవో కొన్ని కో-ఆపరేటివ్ బ్యాంకులు/ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు లాటివి తప్ప నిజానికి బ్యాంకుల దివాళా వలన నష్టపోయిన వినియోగ దారుడు ఇప్పటి వరకూ లేరు!

ఇప్పటివరకూ మనకు ఫిక్స్డ్ డిపాజిట్లపై పెద్దగా అవగాహన లేని రూల్ ఒకటుంది. ఇది నూటికి 99% మంది కి తెలియదు.

ఇప్పటికిప్పుడు ఒక బ్యాంక్ దివాళా తీసినా (జస్ట్ ఒక ఊహకే) మనం దాచుకున్న డబ్బు మీద డి.ఐ.సి.జి.సి (డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) ద్వారా మాక్జిమం ఒక లక్ష రూపాయల మాత్రమే పొందుతాము. అది కూడా ఒక వ్యక్తికి ఒక బ్యాంకు నియమంతోనే! డి.ఐ.సి.జి.సి లో (డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) ద్వారా గరిష్టంగా లక్ష రూపాయల వరకూనే ఇన్సూరెన్స్ చెయ్యబడి ఉంది. దానివల్ల బ్యాంకు డిపాజిట్లుపై మనకి ఉన్న ఆర్ధిక భరోసా ప్రభుత్వం నుంచీ కేవలం లక్ష రూపాయలు మాత్రమే.

బ్యాంక్ ను వ్యాపార సంస్థగా భావించినప్పుడు దాని వ్యాపార జమా ఖర్చుల వివరాలు ఖచ్చితంగా ఉండాలి. చైర్మన్ తో సహా ప్రతి బోర్డ్ సభ్యుడూ బ్యాంక్ పనితీరుకు బాధ్యత వహించాలి. మోదీజీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది 100% ఇదే. ఏదైనా సంస్థ దివాళా తీస్తే సాధారణంగా జరిగే ప్రక్రియ ఆ సంస్థ ఆస్తి అప్పులూ లెక్కగట్టి ఆ దామాషాలో ఉన్న ఆస్తులు అమ్మి పంచుతారు. ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు ఆధారంగా ప్రభుత్వం ఒక కార్పోరేషన్ ని స్ధాపిస్తుంది. ఇది ఆర్బిట్రేటరీ వ్యస్థతో సమానం. కాకపొతే దీనికి ఇవ్వబోయే ప్రత్యేక అధికారాలు..

"ఏదైనా బ్యాంక్ గానీ/ ఆర్ధిక సంస్థగానీ నష్టాల్లో కూరుకుపోతే తక్షణం ఆ సంస్థ యొక్క బోర్డు, షేర్ హోల్డర్ల అధికారాలు రద్దు చేయబడతాయి. ఆ సంస్థ ఈ కార్పోరేషన్ పరిధిలోకి వచ్చేస్తుంది... అప్పుడు పైన చెప్పుకున్నట్టు ఆస్తి అప్పుల వ్యవహారం బేరీజు వేసుకుని సెటిల్మెంట్స్ మొదలు పెడతారు"

ఒక చిన్న లాజిక్ : ఒక బ్యాంకు ఇప్పటికిప్పుడు తమ డిపాజిట్లు ఇవ్వలేక చేతులెత్తేస్తే మనకు చట్టప్రకారం వచ్చేది ఎంత అని అనుకుంటున్నారు?? "లక్ష రూపాయలు" మాత్రమే వస్తుంది, మీ డిపాజిట్ ఎంతైనా కానివ్వండి, మీకు వచ్చేది ఒక లక్ష మాత్రమే! మనకు లక్ష ఇవ్వగా మిగిలిన సొమ్ములు మనల్ని ముంచిన బ్యాంకు వాడికి చెందుతాయి!

ముంచేసినోడికి ఇంకో 1000 కోట్లిచ్చి ఇంకా చెడగొట్టడం ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానం. అలా కాకుండా ఆస్తి/అప్పుల వివరాలు తేల్చి, ఆ మొత్తం సొమ్మంతా డిపాజిట్టు చేసిన వారికి సర్ధుబాటు చేయడాన్ని ''బెయిల్ - ఇన్'' అంటారు. (అంటే మనల్ని ముంచిన వాడికి ఏమీ మిగలదు) దీన్ని మోదీజీ ప్రతిపాదిస్తున్నారు. ఇకముందు బెయిల్ - ఔట్ ను పూర్తిగా తప్పించాలన్నది ఆయన ఆలోచన.

ఈ బిల్లు వలన సామాన్యుడికి అంటే మనలాటి మధ్యతరగతి డిపాజిట్ దారులకు లాభమే గానీ నష్టం లేదు. పైగా ఇప్పుడున్న లక్ష రూపాయల పరిమితిని చట్టపరంగా 5 లక్షలకు పెంచబోతున్నారు.

అలానే ప్రభుత్వ బ్యాంకులలో గానీ, ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ పొందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో వారు నియమాలు పాటించి చేసె ఫిక్స్డ్ డిపాజిట్లలో మనం డిపాజిట్ చేసే ప్రతి పైసాకూ ప్రభుత్వమే జవాబుదారి.

మరి మీడియా ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తుంది??

ఎందుకంటే మనదేశంలో మీడియాను కంట్రోల్ చేస్తున్నది ''పారిశ్రామిక కుటుంబాలే". ఈ బిల్లు వలన వారికి ఇప్పటివరకూ చాలా తేలిగ్గా లభించే రుణాలు రావు.. అలానే వారు ఎగ్గొట్టడానికి ఇప్పటి వరకూ తెరచి ఉంచిన దారులన్నీ మూసుకు పోతాయి. అదీ వారి ఆందోళన. అందుకూ ఇంత విషం చిమ్మడం...

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page