top of page

2019 సం. ప్రభుత్వ సెలవులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు 2019 సంవత్సరానికి సెలవు రోజులను ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులను జి.ఒ. ఆర్.టి. సంఖ్య. 2413 తేదీ:14 -11-2018 ద్వారా విడుదల చేసింది.

ఈ క్రింది నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్ తదుపరి సంచికలో ప్రచురించబడుతుంది అని తెలియజేసారు.

నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుభందం-I (ఎ) పేర్కొన్న వారాoతపు సెలవులలో వచ్చిన పండుగలు మినహాయించి, అనుభందం-I లో నిర్దేశించిన మిగతా అన్ని పండుగల సందర్బముగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2019 సంవత్సరానికి గాను సాధారణ సెలవు దినాలుగా ప్రకటించిబడినది . అదే విధముగా అనుభందం-II లో 2019 లో సాధారణ రోజులలో వచ్చిన ఐచ్చిక సెలవులను మరియు అనుభందం-II (ఎ) లో వారాoతపు సెలవులలో నిర్దేశించిన ఐచ్చిక సెలవులను పేర్కొనబడినది.

2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనములో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 2019 సంవత్సరంలో అన్ని నెలలలో వచ్చిన ఆదివారములు మరియు రెండవ శనివారములలో మూసివేయబడతాయి.

3. రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులు అనుభందం-I లో పేర్కొన్న సాధారణ సెలవులతో పాటు, అనుబంధం-II లోగల 2019 సంవత్సరపు పండుగలకు తమ తమ మతానికి సంబందం లేకుoడా ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవు పొందవచ్చు. ఐచ్ఛిక సెలవులు ఏదైనా పొందటానికి ముoదస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వ ఉద్యోగికి అత్యవసర విధి నిర్వహణ అవసరాలు లేదని పరిగణిoచినప్పుడే ఉన్నత అధికారులచే మంజూరు చేయబడుతుంది. సాధారణ సెలవును మంజూరు చేసే అధికారము కల ఉన్నత అధికారులు సాధారణంగా ఐచ్ఛిక సెలవులను మంజూరు చేయగలరు.

4. ఈ సాధారణ సెలవులు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు మరియు పబ్లిక్ వర్క్స్ విభాగాలు మరియు విద్యాసంస్థలలో పనిచేసే పనివారికి వర్తించదు. ఈ సంస్థలకు సెలవులను ప్రకటన సందర్భాల్లో దానికి సంబంధిoచిన సచివాలయ శాఖల ద్వారా వేర్వేరు ఆదేశాలు జారీ చేయబడును.

5. రంజాన్, బక్రీద్, మొహ్హర్రం మరియు మిలదున్-ఉన్-నబి పండుగల సంభందించి చంద్రుడు కనపడేదాని మీద ఏదైనా తేదీ మార్పు ఉంటే లేదా ఏ ఇతర హిందూ సెలవు దినం వంటి వాటికి సంబంధించి పండుగ తేదీ మార్పు ఉంటే అది ఎలక్ట్రానిక్ / ప్రింట్ మీడియా ద్వారా ప్రకటించబడుతుoది. అటువంటి క్రమంలో సచివాలయoలో అన్ని శాఖలు మరియు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఉతర్వు కోసం వేచిచూడకుండా మీడియాలో ప్రకటన ప్రకారం చర్య తీసుకోవాలి.

( ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి ఉత్తర్వులు మేరకు వారి పేరు మీదుగా జారీ చేయటమైనది )

సం. అనిల్ చంద్ర పునేఠ

ప్రభుత్య ప్రధాన కార్యదర్శి

Comments


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page