top of page

14 అంశాలతో మెమొరాండం సమర్పణ

డియర్ కామ్రేడ్,

ది.10-09-2018 ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున ఇచ్చిన విజ్ఞాపన ను స్వీకరించి డా. మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, భారత అటవీ సేవాధికారి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి), ఆంధ్రప్రదేశ్, గుంటూరు వారు ది. 26.09.2018 సాయంత్రం 04.00 గంటలకు రాష్ట్ర కార్యవర్గ౦ తొ సమావేశంకు తమ విలువైన సమయం కేటాయిస్తూ లేఖను పంపడం జరిగింది.

ఆ సందర్భంగా అటవీ దళాధిపతితో చర్చించవలసిన విషయముల పై ది. 26.09.2018 సాయంత్రం 11.00 గంటలకు రాష్ట్ర కార్యవర్గ౦ సమావేశమై సుదీర్ఘంగా చర్చించి 15 అంశాలతో ఒక మెమొరాండం తయారుచేయుట జరిగినది. వాటి వివరాలు ఈ క్రింద పేర్కోనుట జరిగింది.

 1. జిల్లాలలోని అన్నికార్యాలయాలలోని మినిస్టీరియల్ సిబ్బంది ఖాళీ లను పూరించుటకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించవలసినదిగా.

 2. అలాగే జిల్లాలలోని కార్యాలయాలలో ఖాళీగా ఉన్న సాంకేతిక సహాయకుల (Technical Assistants(formerly known as D.M Grade-II)) ఉద్యోగాలను పూరించుటకు వెంటనే చర్యలు తిసుకోవలసినది గా తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించవలసినదిగా.

 3. ప్రస్తుతం అటవీశాఖ లో ఖాళీ గా ఉన్న (55) (టైపిస్ట్, జె.ఏ.-కం- టైపిస్ట్, జూ.స్టెనో, స్టెనో, స్టెనో-టైపిస్ట్) పోస్టులను సీనియర్ అసిస్టెంట్ గా అప్ గ్రేడ్ చేయ వలసినదిగా,

 4. కొత్తగా ఉద్యోగములో చేరిన మినిస్టిరియల్ సిబ్బందికి, క్షేత్ర స్తాయి సిబ్బందికి ఇస్తున్న విధంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ లో దీర్ఘకాలిక శిక్షణా తరగతులు నిర్వహించ వలసినదిగా.

 5. అటవీశాఖ లో పని చేస్తున్న సూపరింటెండెంట్ పోస్టులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పేరు మార్చి గెజిటెడ్ హోదాను మంజూరు చేయాలన్న అసోసియేషన్ అభ్యర్థనపై ప్రభుత్వానికి సానుకూలంగా ప్రతిపాదనలు పంపించవలసినదిగా.

 6. జూనియర్ అసిస్టెంట్ మరియు దానికి సమానమైన ఉద్యోగుల నియామకం మరియు బదిలీల కోసం జిల్లాను ఒక యూనిట్ గా తిసుకోవలసినదిగా.

 7. అన్ని కేటగిరీ లలో పదోన్నతులను కల్పించ వలసినదిగా.

 8. ఏ.పి.ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2000 ప్రకారం జూనియర్ అసిస్టెంట్స్ & సమానమైన కేడర్ ఉద్యోగులను అటవీ సెక్షన్ అధికారిగా బదిలీ ద్వారా నియామకాలు కోటా ప్రకారం జరిగేలా చర్యలు తిసుకోవలసినదిగా.

 9. సూపరింటెండెంట్ / మేనేజర్ ల బదలీలు చేసేటప్పుడు డివిజన్ మరియు సర్కిల్ కార్యాలయాలలో ఉన్న మేనేజర్లు మరియు సూపరింటెండెంట్స్ పోస్టులలో వైస్ వెర్సా గా బదిలీలు కల్పించుటకై ఆలోచించి తగు చర్యలు తిసుకోవలసినది ఎందుకంటే ఆ రెండు పోస్టుల ఒకే కేటగిరి కి చెందినవి కనుక.

 10. కనీస వసతులు (ఉదా. భోజనం చేసేందుకు వసతి, బల్లలు, కుర్చీలు, కంపూటర్ లు, ప్రింటర్ లు, ఇంటర్నెట్ సదుపాయం, ఆడవారి కోసం మరుగుదొడ్లు, మొదలగు) లేని సర్కిలు, డివిజను, రేంజ్ కార్యాలయాలలో వాటిని కల్పించవలసినదిగా.

 11. ప్రతి టేరిటోరియల్ డివిజనల్ కార్యాలయం/సర్కిల్ కార్యాలయాలలో రికార్డులు భద్రపరచేందుకు ఒక గదిని ఏర్పాటు చేయడం తో పాటు ఒక ఆఫీస్ సబార్దినేట్ ను రికార్డు అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించి రెవిన్యూ కార్యాలయాలలో మాదిరిగా రికార్డు గదిని నిర్వహించడానికి వీలు కల్పించావలసినదిగా.

 12. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయ భవనం కొరకు కడప నగరం లో గల చెల్లమ్మయిపేట, వై.ఎస్.ఆర్.కడప జిల్లలో గల 0.04 సెంట్ల సర్వ్ నెం. 639/2 భూమిని అసోసియేషన్ కి మంజూరు చేయవలసినదిగా.

 13. ప్రస్తుతం ఊరికి దూరంగా ఉన్న ఏవిధమైన కమ్యూనికేషన్ లేని గుంటూరు డివిజనల్ అటవీ శాఖాధికారి వారి కార్యాలయాన్ని నగరంలోని కి మార్చి అందులో పనిచేసే ఉద్యోగుల కు వీలుగా ఉండే సదుపాయం కల్పించావలసినడిగా.

 14. తిరుపతి బయో ట్రిమ్ లో ఖాళీ గా ఉన్న వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కొరకు కేటాయించవలసినదిగా.

ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు, జనరల్ సెక్రెటరీ అహెసాన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మాధవ రెడ్డి, ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం లో పై పేర్కొన్న అంశాలపై సుదీర్ఘం గా చర్చించిన రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ ఇబ్బందులను పరిష్కరించుట కై తీసుకోన వలసిన చర్యలను గురించి సవివరమైన సమర్ధన నివేదికను తయారుచేసి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి(అటవీ దళాధిపతి), ఆంధ్రప్రదేశ్, గుంటూరు వారికి సమర్పించుట జరిగింది.

ఈ అజెండాలోని ప్రతి అంశం పైనా అటవీ దళాధిపతి గారితో చర్చించడం జరిగింది. వారు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి దానిపై తదుపరి చర్యలకోరకు శ్రీ వి.బి.రమణ మూర్తి, ఐ.ఎఫ్.ఎస్. ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి, (ఎఫ్. ఆర్.) వారిని ఆదేశించుట జరిగినది.

ఈ కార్యక్రమం లో అన్నీ జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. హెడ్ ఆఫీసు నుండి శ్రీ సత్యనారాయణ, శ్రీమతి పద్మావతి, శ్రీ కొండ నాయక్ మొదలగు వారు కూడా పాల్గొని వారి కార్యాలయంలోని సిబ్బంది సమస్యల గురించి కూడా అటవీ దళాధిపతికి తెలియపరచడం జరిగింది. అన్నీ విషయాలపై అతి త్వరలో చర్యలు చేపడతామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ శ్రీ టి. రామచంద్ర రావు, మరియు జనరల్ సెక్రెటరీ సి. మొహమ్మద్ అహసాన్, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి పూర్తి విశ్వాసంతో నడిపించారు.