జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని
- APFSA
- Aug 15, 2018
- 1 min read
దిల్లీ: భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఇవాళ దేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు. పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి. పేదలు, దళితులు, వెనుకబడి వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయి. దేశ రక్షణలో త్రవిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్న.
దేశంలో ఓ పక్క వర్షాలు పడుతున్నాయన్న సంతోషం ఉన్నా.. మరోపక్క వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళ కవి సుబ్రమణ్య భారతి స్వప్నించిన భారతాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనులు, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం. 125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నాం. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం. ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు, ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు నెరువేరుతున్నాయి.
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....
Comments