ప్రపంచ మహిళా దినోత్సవం 2018
రాజమహేంద్రవరం లోని లాలాచెరువు వద్ద గల మహా పుష్కర నగరవనంలో మార్చి 8 వ తేదీ గురువారం నాడు ఉదయం 7 గంటలకు అటవీశాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా నగరవనం గేట్ - 1 వద్ద 2 కె రన్ ను అటవీశాఖ కాకినాడ డీఎఫ్ఓ శ్రీమతి నందని సలారియా జెండా ఊపి ప్రారంభిస్తారు. అటవీశాఖ మహిళా ఉద్యోగులు, నగర వనానికి వాకింగ్ నిమిత్తం వచ్చే వివిధ రంగాల మహిళలు ఈ వాక్ లో పాల్గొంటారు. అనంతరం గేట్ నంబర్ -2 వద్ద మహిళలకు హెల్త్ టిప్స్, ఆత్మరక్షణ పద్ధతులపై డిమాన్స్ట్రేషన్, వివిధ రంగాలలో స్ఫూర్తిప్రదాతలైన మహిళలకు అభినందన కార్యక్రమం జరుగుతాయి. కార్యక్రమంలో అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలిమ అగర్వాల్ తదితరులు పాల్గొంటారు.
Comments